• Download Dailyhunt App

Sign UP / Sign In



 

Category


Bhrama ( భ్రమ )

Author: వసుంధర

Telugu

49 ( 29% off)
35

  • My Rating


  • Review Title


  • Review Comment



To read this book you need to Download the Dailyhunt App on your phone. Available in Android, Windows & Iphone

అర్దరాత్రి పూట తలుపు తట్టిన చప్పుడుకు కూర్మారావుకు మెలకువ వచ్చింది. అతడోసారి లేచి కూర్చుని కళ్ళు నులుముకున్నాడు.కూర్మారావు నేలకు ఆరొందలు సంపాదించుకుంటున్న గుమస్తా. ప్రస్తుతం బ్రహ్మచారిగానే వుంటున్నాడు. తండ్రికి ప్రతి నెలా నూటయాభై రూపాయలు పంపిస్తాడు. అతడికి పెళ్ళి చేసుకుని సుఖపడాలనుంది కానీ తన కొచ్చే జీతంతో తనకున్న బాధ్యతలతో పెళ్ళి చేసుకుంటే సుఖముండదని భయపడుతున్నాడు. అతడు ప్రస్తుతముంటున్నది ఓ చిన్నగది. దాని అద్దె నెలకు వంద రూపాయలు. ఆ గదిని బ్రహ్మచారులకే తప్ప గృహస్థుల కివ్వనని కూర్మారావుకు కచ్చితంగా చెప్పేశాడింటి యాజమాని. పెళ్ళి చేసుకుంటే అతడిల్లు మారాలి. వేరెక్కడైనా గదికే రెండొందలడుగుతున్నారు. అసలు కూర్మారావు ఖాళీ చేస్తే ఆ గాడికి అద్దె పెంచాలని యింటి యజమాని అనుకుంటున్నాడు.మళ్ళీ తలుపు తట్టిన చప్పుడైంది. ఈసారి కూర్మారావు లేచివెళ్ళి తలుపు తీశాడు.సుడిగాలిలా లోపలకు ప్రవేశించాడో యువకుడు కూర్మారావు వెంటనే కాకపోయినా అతణ్ణి గుర్తుపట్టాడు. అతడు వెంకట్రాజు హైస్కూల్లో అతడి క్లాసుమేటు ఆ తర్వాత అప్పుడప్పుడు కలుసుకుంటూండేవారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా యిష్టం. ఆర్నెల్ల క్రితం ఏ ఊరొచ్చినపుడు వెంకట్రాజు కూర్మారావు గదిలోనే నాలుగు రోజులుండి వెళ్ళాడు.

  • Release Date:
  • Book Size: 221 KB
  • Language: Telugu
  • Category: Kalpana

    Be the first to rate




Top

If you want to read ebooks please download our app in your favorite mobile